Minister Thummala: రాష్ట్రంలోని రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Shiva |
Minister Thummala: రాష్ట్రంలోని రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రుణ మాఫీతో రైతు కుటుంబాలకు కాంగ్రెస్ సర్కార్ (Congress Government) కొండంత అండగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏడాది పాలనలో వ్యవసాయం రంగంలో సాధించిన విజయాలు, పురోభివృద్ధిపై మంత్రి తుమ్మల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబినెట్‌లో ప్రధాన ప్రధాన్యతను రైతంగానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 35 శాతం కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. సాహసోపేతంగా రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయమని అన్నారు. నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు గాను రూ.20 వేల కోట్ల మేర రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేసిందని తెలిపారు.

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రూ.10 వేలు చొప్పున సాయం చేసేందుకు పంట బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) దృష్ట్యా గత ప్రభుత్వం రైతు బంధు (Rathu Bandhu) పథకానికి సంబంధించి రూ.7,625 కోట్లు రైతులకు చెల్లించలేదని అన్నారు. అనంతరం రైతుల కోరిక మేరకు ఏప్రిల్, మే నెలల్లో రైతు భరోసా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.7,625 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఈ సంక్రాంతి తరువాత రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నగదు జమతో పాటు సన్నాలకు బోనస్ కూడా ఇస్తామని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పామాయిల్ బోర్డు (Palm Oil Board) ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించామని అన్నారు. నిజామాబాద్‌లో పసుపు, ఖమ్మం జిల్లాలో కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు.

Advertisement

Next Story