- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్లలో ఆ విషయం ఎప్పుడూ గుర్తురాలేదా?.. కవితపై శ్రీధర్ బాబు సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కవితకు అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫూలే విగ్రహం ఏర్పాటును అప్పటి సీఎం అడ్డుకున్నారా? లేక స్పీకర్ అడ్డుకున్నారా? అనేది ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందే కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
మహనీయులను స్మరించుకోవడంలో కాంగ్రెస్‌కు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పూలే అంశం తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. అసెంబ్లీ పరిసరాలు పూర్తిగా స్పీకర్, మండలి చైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని, పైగా మండలి చైర్మన్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నారు. నిజామాబాదులో కవిత గెలవనని తెలిసి, ఓడిపోయే సీటును బీసీలకు కేటాయిస్తామంటున్నారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు అనేది కేబినెట్లో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ తీసుకునే నిర్ణయాలను తప్పుబట్టడం కేటీఆర్‌కు సమంజసం కాదని, ఎమ్మెల్సీల అంశంపై కోర్టులో కేసు నడుస్తుందని, న్యాయస్థానాన్ని కూడా తప్పుబడతారా? అని ప్రశ్నించారు.