Minister Sridhar Babu: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. రిటైర్మెంట్ వయసుపై మంత్రి కీలక ప్రకటన

by Shiva |
Minister Sridhar Babu: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. రిటైర్మెంట్ వయసుపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పొడిగిస్తారనే వార్తలు రాష్ట్రంలో పుకార్లు షికారు చేస్తున్న వేళ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక ప్రకటన చేశారు. మంగళవారం రాత్రి ఆయన సచివాలయం (Secretariat)లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) లేదని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి లాజిస్టిక్స్ వెన్నుముకగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని నార్త్ కారిడార్ (North Corridor) కేంద్రంగా డ్రైపోర్టు (Dry Port)ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డ్రైపోర్టును అభివృద్ధి చేస్తామని.. అందుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే రెండు డ్రైపోర్టులు రాబోతున్నాయని పేర్కొన్నారు. టైర్-2 సిటీల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి పనులు చేపడుతామని అన్నారు. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఫిబ్రవరి 7న కీలక ప్రకటన ఉంటుందని తెలిపారు. కొత్త ఐటీ పాలసీ (IT Policy)ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆ రంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

అదేవిధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీ (Future City)ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఔట్‌లుక్ మాల్స్ (Outlook Malls) తరహాలో హైదరాబాద్ (Hyderabad) చుట్టూ మాల్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అదేవిధంగా ఐటీ సంబంధించి ఈస్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేధాలు లేవని.. అవన్ని పుకార్లేనని మంత్రి శ్రీధర్ బాబు కొట్టి పడేశారు.

Next Story

Most Viewed