మేడారం భక్తులకు శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ఆదేశం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-04 12:12:38.0  )
మేడారం భక్తులకు శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సమ్మక్క-సారలమ్మ జాతరలో జరిగిన పొరపాట్లపై అధికారులతో చర్చించారు. క్యూలైన్లు, మౌలిక సదుపాయాల విషయంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మేడారం వచ్చే భక్తుల కోసం కాటేజ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండోమెంట్ ఇచ్చిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉత్సవంగా నిర్వహించే ఈ జాతరకు దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీనిని తెలంగాణ కుంభమేళాగా భావిస్తారు. ప్రతిసారి కనీసం సుమారు కోటికిపైగా భక్తులు వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు.

Advertisement

Next Story