- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Minister Seethakka: బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు.. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని ప్రజలకు చిత్తుగా ఓడించినా ఆ పార్టీలో నాయకులకు ఇంకా అహకారం ఏమాత్రం తగ్గలేదని మంత్రి సీతక్క (Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడుతూ.. దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదని అన్నారు. స్పీకర్ చైర్‌ను పట్టుకుని నువ్వు అని సంభోధించడం సభా సంప్రదాయాలను మంటగలపడమేనని అన్నారు. స్పీకర్ దళిత జాతికి చెందిన వ్యక్తి కావడంతోనే అలా ఏకవచనంతో సంభోధిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ (BRS) అగ్ర నాయకులతో సహా ఆ పార్టీలో ఉన్న ప్రతి నేతకు మహిళా రాష్ట్రపతి (President) అంటే కూడా గౌరవం లేదని అన్నారు. ఆమె ఆదివాసి కాబట్టే చులకనగా మాట్లాడటం వారికి అలవాటైందని మండిపడ్డారు.
కాగా, అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మాట్లాడుతూ.. 36 నిమిషాల గవర్నర్ ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు. ప్రసంగం చదివేటప్పుడు గవర్నర్ మనసు ఎంత నొచ్చుకుందోనని కామెంట్ చేశారు. రైతుల గురించి సభలో మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతుండగా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ (BRS)కు వ్యతిరేకంగా నినానాదాలు చేయడంతో జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్రీ ఆపి.. మూసుకుని కూర్చోవాలని ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించింది తాము కాదని కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. ఈ క్రమంలోనే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) కలుగజేసుకుని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని జగదీశ్ రెడ్డికి సూచించారు. బీఆర్ఎస్ (BRS) సభ్యులు అసహనానికి గురికావొద్దని.. సభా సంప్రదాయాలను పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. అయితే, స్పీకర్ వ్యాఖ్య పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. సభా సంప్రాదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని, సభ స్పీకర్ సొంతం కాదని జగదీశ్ రెడ్డి అన్నారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.