- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటి ఓ బచ్చా.. మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఓ బచ్చా అని, ఆయన డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలుతో సమానమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. పేదలను పీడించిన దోపిడీదారులే పొంగులేటి వంచన ఉన్నారన్నారు. ‘‘మొన్నటిదాకా గులాబీ జెండా కింద ఉండి సంపాదించుకున్న ఒక నాయకుడు మమ్మల్ని విమర్శిస్తున్నాడని, టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవాళ నీ ఆర్థిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడి వేల కోట్ల దోచుకున్నావని, నీ దగ్గర పాపపు సొమ్ము పేరుకు పోయిందని ఫైర్ అయ్యారు. డబ్బుందని విర్రవీగుతున్నావని, మా ఖమ్మం ప్రజలకు నీ డబ్బు ఎడమ కాలు చెప్పుతో సమానం అన్నారు. నీ డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు ఇక్కడ లేరని.. నలుగురికి డబ్బులు ఇచ్చి సభలు పెట్టి అదే గొప్పగా ఫీలవుతున్నావు’’ అంటూ పువ్వాడ విమర్శించారు.
ఏ రాజకీయ పార్టీకి పోవాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి పొంగులేటి అని, సభ పెట్టితే ఖాళీ కుర్చీలను చూసి ఆ ఆవేదనతో తనను తిడుతున్నాడని మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడని, ఒక సిద్ధాంతం, విలువ, గుణం లేదు.. కేవలం డబ్బు రాజకీయంతో పనిచేయాలని చూస్తుతున్నాడని, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఇదే పార్టీలో ఉండి ఓడించిన ఘనమైన చరిత్ర పొంగులేటిదని, 2018లో నువ్వు చేసిన పిచ్చి పనికే 2019లో నీకు సీటు రాకుండా చేసిందన్నారు. 2014లో కూరాకుల నాగభూషణం గొంతు కోసిన చరిత్ర మర్చిపోయావా? అంటూ విమర్శించారు.
వెంట ఉన్నోళ్లంతా అరాచకవాదులే..
‘‘బిడ్డా.. నీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళ చిట్టా చాలా పెద్దగా ఉంది.. వాళ్లంతా నీకు వచ్చే రోజుల్లో స్వాగతం చెప్పబోతున్నారు. నువ్వు ఇంకా ఎన్ని రాజకీయ పార్టీలను మోసం చేస్తావ్?? నీకు చరిత్రనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పిట్టలదొర మాదిరి ప్రగల్భాలు పలికితే ఊరుకోమన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఓ బచ్చా. ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో పువ్వాడ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. పొంగులేటి పక్కన ఉన్నోళ్లు రౌడీషీటర్లు, గంజాయి అమ్మేవాళ్ళు, బ్యాంకులను దోచుకున్నోళ్ళు.. రైతుల నోట్లో మట్టుకొట్టినోళ్లే. దోపిడీదారులు అరాచక వాదులకు కేరాఫ్ అడ్రస్ పొంగులేటి. కాంట్రాక్టర్‌గా ఉన్నప్పుడు కెనాల్ మోడల్‌లో పనులు చేయకుండా వందల కోట్ల రూపాయలు బొక్కినావని, నీ పాలోడే ఆరోజు నీ మీద కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే జైల్లోకి పోకుండా రాజకీయాల్లో చేరావు’’ అని పొంగులేటిపై పువ్వాడ ఘాటు విమర్శించారు.
Also Read..