Ponnam Prabhakar: గౌడ కులస్థులకు మంత్రి పొన్నం కీలక పిలుపు (వీడియో)

by Gantepaka Srikanth |
Ponnam Prabhakar: గౌడ కులస్థులకు మంత్రి పొన్నం కీలక పిలుపు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గౌడ(Goud) కులస్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో గోపా(గౌడ అఫీషియల్ అండ్ ఫ్రొఫషనల్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మాట్లాడారు. కార్తీకమాస వనభోజనాల సందర్భంగా గోపా ప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

గోపాను విస్తరించాలి.. ప్రతీ గౌడ బిడ్డ గోపాలో సభ్యుడుగా ఉండాలని సూచించారు. ఇటువంటి వేదికల ద్వారా మన బలప్రదర్శన చేసుకోవాలని చెప్పారు. కార్తీక వనభోజనాలు కుటుంబాలతో కలిసి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed