Ponnam Prabhakar: అలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు! మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh N |
Ponnam Prabhakar: అలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు! మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. రహదారి భద్రత మన అందరి బాధ్యత అని తెలిపారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో (Walkathon) వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ (Road Safety Awareness Walkathon) పై ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వాకథాన్‌లో రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి భద్రతను పాఠ్యాంశంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు రక్షించాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని హెచ్చరించారు. కాగా, జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరిగాయి. ఈ క్రమంలోనే ఇవాళ్టితో రోడ్డు భద్రతా మహోత్సవాలు ముగిశాయి.

Next Story

Most Viewed