కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం.. అవునా? కాదా? నిజం చెప్పాలని డిమాండ్

by Disha Web Desk 9 |
కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై మంత్రి పొన్నం ప్రశ్నల వర్షం.. అవునా? కాదా? నిజం చెప్పాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో శనివారం పోస్టు పెట్టారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని కిషన్ రెడ్డి, బండిని పొన్నం డిమాండ్ చేశారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్‌‌లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. 1986 నుంచి రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేయడానికే కుట్ర చేస్తుందని అన్నారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బీజేపీ కాదా? అని అడిగారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణన సర్వే జరపాలని ఎవరికెంతో - వారికంత అనే నినాదిస్తే ప్రభుత్వం తరుపున కులగణన సర్వేకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అన్నారు. రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూల దోసింది బీజేపీ ప్రభుత్వం కాదా..? బీహార్‌లో 50-65 శాతానికి రిజర్వేషన్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ బీసీలకు ఇచ్చింది దీనిని తట్టుకోలేక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరపర్చలేదా? అని పొన్నం మండిపడ్డారు.

Next Story

Most Viewed