Minister Ponnam : పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

by Sathputhe Rajesh |   ( Updated:30 July 2024 9:06 AM  )
Minister Ponnam : పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పరోక్షంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. విద్యార్థి నాయకుడిగా, ఎంపీగా ఆనాడు పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడాను అని పొన్నం తెలిపారు. తన గొంతు ప్రతిపక్షాలకు మంచిగా అనిపియకుంటే తానేం చేయాలే అంటూ మంత్రి సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పార్టీ అధికారంలో ఉన్నా ఇలానే మాట్లాడాను అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరం ఉంటే రికార్డులు తెప్పించుకుని చూడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed