Ponguleti srinivas Reddy : మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
Ponguleti srinivas Reddy : మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటుబాంబు పేలబోతోంది అంటూ ఇదివరకే ఓసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈసారి నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు.. త్వరలోనే ఆటమ్‌ బాంబ్‌(Atom Bomb) పేలబోతోంది అంటూ ప్రకటించారు. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే బీఆర్ఎస్(BRS) నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. తప్పు చేసిన ఎవ్వరినీ చట్టం వదిలి పెట్టదని.. ఏ తప్పూ చేయకపోతే అంత వివరణ ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చెందిన రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో త్వరలోనే బయటపడతాయని, అపుడు ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఆటంబాంబు పేలుతుంది.. సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో జరిగిన అక్రమాల్లో కేటీఆర్ జైలుకు వెళతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed