ponguleti srinivas reddy: త్వరలో కటాప్ తేదీ.. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Prasad Jukanti |
ponguleti srinivas reddy: త్వరలో కటాప్ తేదీ.. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చివేసిందని, రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. మేము బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.7.19 లక్షల కోట్లు ఉందన్నారు. ఇంత అప్పు భారం ఉన్నప్పటికీ వీటిని కుంటిసాకులుగా చూపి ఇచ్చిన హామీల విషయంలో వెనుకడుగు వేయబోమమన్నారు. రైతులకు రుణమాఫీనే ఇందుకు ఉదాహరణ అన్నారు. దుబార ఖర్చులన్నింటిని దూరంగా పెట్టి రైతులు రాజును చేయడమే ఏకైక లక్ష్యంగా 26 రోజుల్లో సుమారు రూ.18 వేల కోట్లతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ మొత్తానికి రూ.31 వేల కోట్ల పైచిలుకు ఖర్చు వస్తుందని ముందే మేము ఊహించామని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ఇంకా సుమారు రూ.12 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉందని త్వరలోనే వాటిని జమ చేస్తామన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా శనగలు తిని చేతులు దులుపు కున్నట్లుగా రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసి టాటా బైబై అని మేము చెప్పడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా రుణమాఫీ చేశామన్నారు. రూ.20 వేల కోట్లు రావాల్సిన ఓఆర్ఆర్ ను బీఆర్ఎస్ స్వార్థం కోసం తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్లకు తాకట్టు పెట్టి రైతుల ఎన్నికల సమయంలో రైతుల మీద ప్రేమ ఉన్నట్లుగా రుణమాఫీకి బదలాయించారని ఆరోపించారు.

కేటీఆర్ నీ సలహాకు థాంక్స్:

రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్నయం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. మా కేబినెట్ కు ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం, ఏ రకమైన అధికారాలు ఉన్నాయో మాకు తెలుసన్నారు. మీ సూచన ఇచ్చినందుకు థాంక్స్ అంటూ సెటైర్ వేశారు. నిజమే మా కేబినెట్ కు మీకు లా అబద్ధాలు చెప్పుకోవడం, గోబెల్స్ ప్రచారం చేసుకోవడం రాదన్నారు. చేసిన మంచి పనిని కూడా మేం ప్రచారం చేసుకోవడం లేదని, గత ప్రభుత్వం వలే ప్రభుత్వ సొమ్ముతో వేలాది కోట్ల రుపాయలను పబ్లిసిటీకి ఉపయోగించుకోవడం లేదన్నారు. భవిష్యత్ లోనూ వాడుకోబోమన్నారు. మీకులా మాటలు చెప్పబోమని, చేతనైతే చేస్తామని చెయని పక్షంలో అంతే ధైర్యంగా చేయలేకపోతున్నామని చెబుతామన్నారు.

త్వరలోనే ఆ రైతులకు కటాప్ తేదీ:

రుణమాఫీ చేయకపోతే వదలమని అంటున్న బీఆర్ఎస్ కు నైతిక హక్కు ఎక్కడిదన్నారు. పదేళ్లు పరిపాలించి కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిన మీ మొహాలకు పదినెలలు కూడా కానీ ఈ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిదన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని రైతులకు తెలియజేస్తున్నానన్నారు. గత ప్రభుత్వంలా మాయమాటలు చెప్పడం లేదన్నారు. అవాక్కులు చెవాక్కులు పేలే, రెచ్చగొట్టే బీఆర్ఎస్ నాయకుల మాటలను రైతులు నమ్మొద్దన్నారు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్న వారు పై మొత్తాని కట్టాలని ముందుగానే నిర్ణయ తీసుకున్నామని కొంత మంది ఆ పై సొమ్మును చెల్లించని కారణంగా వారికి రూ.2 లక్షల నగదు జమ కావడం లేదన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే రైతులకు ఒక కటాప్ తేదీని పెడతామన్నారు. వారు మిగిలిన డబ్బులు కట్టిన మరుక్షణమే వారి రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. అప్పుడు అనుకున్నట్లుగా రూ.31 వేల కోట్ల అంఖ్యలు వస్తాయన్నారు. దీనికంటో మరో 15 వదల కోట్లు అదనంగా అయినా అర్హులైన వారందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఉచిత కరెంట్, గ్యాస్ రాయితీ లబ్ధిదారుల సంఖ్య నిరంతరం ప్రక్రియ అన్నారు.

Advertisement

Next Story