Minister Ponguleti: ‘లొట్టపీసు’ మాటలు మాట్లాడాల్సి అవసరం ఏంటి.. కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్

by Shiva |
Minister Ponguleti: ‘లొట్టపీసు’ మాటలు మాట్లాడాల్సి అవసరం ఏంటి.. కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ (ACB) అధికారులు కేసు నమోదు చేస్తే.. లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ (KTR) మాట్లాడాల్సిన అవసరం ఏంటని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఇవాళ ఖమ్మం (Khammam)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు (BRS Ministers) ఇష్టానుసారంగా తప్పులు చేసి తామేదో గొప్పలు చేశామని చెప్పుకోవడం సిగ్గేచేటని ఎద్దేవా చేశారు. మంత్రలు చెబితేనే తాము చేశామని అధికారులు ఏసీబీ (ACB), ఈడీ (ED) విచారణలో వాళ్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని కామెంట్ చేశారు.

ఎవరి పట్ల తమ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించబోదని అన్నారు. కానీ, ప్రభుత్వ సొమ్మును అప్పనంగా మింగేసిన వారిని మాత్రం వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race)కు సంబంధించి ఏసీబీ (ACB) కేసు నమోదు చేయగానే.. ఈడీ (ED) ఎంటరైందని తెలిపారు. కేటీఆర్‌ (KTR)ను ఏసీబీ (ACB) ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారని.. మరి ఈడీ (ED) ఎందుకు అరెస్ట్ చేయలేదో వాళ్లు కూడా సమాధానం చెప్పాలన్నారు. రైతు భరోసా (Raithu Bharosa) విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సాగులో ఉన్న ప్రతి ఎకరానికి ‘రైతు భరోసా’ తప్పక వస్తుందని అన్నారు. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగానే కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Next Story