- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samagra Kutumba Survey: తెలంగాణ సర్వే దేశానికి ఆదర్శం : మంత్రి పొంగులేటి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో జరుగుతోన్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (Samagra Kutumba Survey) దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana)లో జరుగుతోన్న సమగ్ర కుటుంబ సర్వేను భవిష్యత్ లో దేశం మొత్తం రోల్ మోడల్ గా తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలంతా ఈ సర్వేకు సహకరించాలని కోరారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగనుంది.
రాష్ట్రంలో తొలి రెండ్రోజుల్లోనే 70 శాతం ఇళ్లను గుర్తించారు సిబ్బంది. కొన్ని జిల్లాల్లో 50 శాతం ఇళ్లను గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రాష్ట్రంలో 1.17 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ సర్వే పూర్తయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుందని తెలుస్తోంది. ఇంటి యజమాని పేరు, వివరాలు, నంబరు తీసుకుని.. సిబ్బంది ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తున్నారు. ఈ స్టిక్కర్ పై గ్రామం, మున్సిపాలిటీ పేరు, వార్డు నంబర్, ఎన్యుమరేషన్ బ్లాక్ నంబర్, బ్లాక్ లో ఉన్న ఇళ్ల సంఖ్య ఉంటాయి.