- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
TS: జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి కీలక హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: తమ ప్రభుత్వం నిబద్దతతో ఉందని.. జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి పొంగులేటిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) ప్రతినిధులు కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇళ్ల స్థలాల అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల కోరికైన సొంతిళ్లను సాకారం చేసే విశాల హృదయం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉందని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజేహెచ్‌ఎస్ ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు గంగాపురం ప్రతాప్ రెడ్డి, కొత్తకాపు విక్రమ్ రెడ్డి, స్వామిరెడ్డి, సభ్యులు శ్రావణి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.