- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో ఎక్కడి నుండి పోటీ చేసిన మోడీని ఓడిస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ తెలంగాణలో మహబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేయనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీ తెలంగాణ నుండి పోటీ చేస్తానని అంటున్నారట.. కానీ మోడీ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా మోడీ పైశాచికంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ అక్కడ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిందని.. హోంమంత్రి అమిత్ షా సీక్రెట్‌గా ఓ సర్వే సైతం చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.