Minister Mallareddy:కేసీఆర్‌కు ఆ పదవి దక్కాలని మొక్కిన.. నేను ఏది కోరిన సక్సెసే

by Satheesh |   ( Updated:2023-07-09 10:04:21.0  )
Minister Mallareddy:కేసీఆర్‌కు ఆ పదవి దక్కాలని మొక్కిన.. నేను ఏది కోరిన సక్సెసే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని ఉజ్జయిని మహంకాళికి మొక్కినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైంది.. బీజేపీ కాంగ్రెస్ పారిపాలనలు చూశాం.. కానీ ఎక్కడ కూడా దేశంలో బీఆర్ఎస్ పార్టీ చేసినంతగా అభివృద్ది చేయలేదని అన్నారు. అమ్మవారి దయ తోని దేశమంతా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పారు.

చిన్నపట్టి నుంచి కుటుంబ సమేతంగా మహంకాళి బోనాల జాతరకు వచ్చేవారని, అమ్మవారిని ఏది కోరినా.. తన మొక్కు మాత్రం సక్సెస్ అయ్యేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ కోసం దేశమంతా ఎదురు చుస్తున్నారని, తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో.. సీఎం కేసీఆర్ అయితేనే దేశంలోని 27 రాష్ట్రాలను అభివృద్ధి చేయగలుగుతాడని అన్నారు.

Advertisement

Next Story