చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. కాంగ్రెసోళ్లకు లెక్కలు రావు: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్

by Javid Pasha |   ( Updated:2023-08-05 11:05:03.0  )
చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. కాంగ్రెసోళ్లకు లెక్కలు రావు: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు గుప్పించారు. చిన్న పిల్లలకు ఎక్కాలు రావు.. కాంగ్రెసోళ్లకు లెక్కలు రావు అని సెటైర్లు వేశారు. ఉన్నదే 10 మంది.. కానీ అందరూ సీఎం అభ్యర్థులేనని పంచులు వేశారు. కర్ణాటకలో గెలిచారని తెలంగాణలో కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో కరువు, కటిక దరిద్రం వంటి సీన్లు తీయాలంటే సినిమా వాళ్లు తెలంగాణకు వచ్చి షూటింగ్ లు చేసేవారని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు మారాయని అన్నారు.

సాగునీరు బాగా అందడంతో పుష్కలంగా పంటలు పండి రైతులు బొడ్రాయి వంటి పండుగులు చేసుకుంటున్నారని అన్నారు. కానీ తాము చేసిన అభివృద్ధి ఎంత చెప్పినా కాంగ్రెసోళ్లకు అర్థం కావడం లేదని అన్నారు. తమ విధానాల వల్లే ఇవాళ తెలంగాణలో భూములు ధరలు అమాంతం పెరిగాయని మంత్రి చెప్పొకొచ్చారు.

Advertisement

Next Story