- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్స్‌స్టా గ్రామ్ MLA వద్దు.. సీతక్కపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ములుగు అభ్యర్థి సీతక్కపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా జిల్లాను చేసిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సీతక్క తల్లిదండ్రులకు కూడా పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే సొంతమన్నారు. ఈ సారి ములుగులో వంద శాతం గెలుస్తామని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎమ్మెల్యే సీతక్కను కాకుండా.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే బీఆర్ఎస్ అభ్యర్థిని బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించండని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో చేసిన తప్పును ఈ సారి ములుగు ప్రజలు చేయొద్దని సూచించారు.
గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. అలాగే కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీనే ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతోనే.. రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి రద్దు చేసిందని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ అని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కాంగ్రెస్ చెప్పే కథలను నమ్మొదని కేటీఆర్ విజ్ఙప్తి చేశారు.