Konda Surekha: రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ఫారెన్ టూర్

by Gantepaka Srikanth |
Konda Surekha: రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ఫారెన్ టూర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలు మెరుగైన జీవితం గడపాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ విదేశీ పర్యటనల వెనుక వ్యక్తిగత స్వార్థం లేదని, కేవలం రాష్ట్రం బాగు కోసమే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు బోగస్ కంపెనీలతో ఎంవోయూలు జరిగాయని విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, దళితబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో పథకాలు ప్రవేశ పెట్టి దోపిడీకి పాల్పడ్డారు అని ఆరోపించారు. పదేళ్లు ప్రజల సొమ్ము దోచుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేవలం రేవంత్ సర్కార్ మీద అసత్య ప్రచారం చేయడానికి ఒక సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను గాంధీ భవన్‌ టీమ్ స్ట్రాంగ్‌గా ఎదుర్కొంటోందని అన్నారు.

Advertisement

Next Story