- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘తెలంగాణ రాజకీయాల్లో మందా జగన్నాథం తనదైన ముద్ర’

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్(Nagarkurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) మృతిపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మందా జగన్నాథం మృతి తనను దిగ్ర్భాంతికి చేసిందని అన్నారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా విశేష సేవలు అందించడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. రాజకీయాల్లో ఉంటూ ఎన్నోవిధాలుగా ప్రజలకు సేవలందించారుని తెలిపారు. మందా జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన జగన్నాథం నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు.