- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘N కన్వెన్షన్’ కూల్చివేతపై స్పందించిన మంత్రి జూపల్లి.. ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరిక
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా మూడెకరాల స్థలంలో ఈ కన్వెన్షన్ నిర్మించారని శనివారం తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేశారు. అయితే, ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే.. ప్రజల ఆస్తి అని అన్నారు. కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాదుల వచ్చాయి. దీంతో పక్కా ఆధారాలతో ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది.