నిధులిస్తే ఆ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం.. కేంద్ర మంత్రికి జూపల్లి రిక్వెస్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-24 06:40:56.0  )
నిధులిస్తే ఆ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం.. కేంద్ర మంత్రికి జూపల్లి రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌ను రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. శ‌నివారం ఢిల్లీలోని గజేంద్ర షెకావత్‌ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో మంత్రి జూప‌ల్లి సమావేశమయ్యారు. తెలంగాణ‌లో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని జూప‌ల్లి తెలిపారు. ప‌ర్యాట‌క అభివృద్ధికి నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ఆయన వివ‌రించారు. దీనిపై కేంద్రమంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

అనంత‌రం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ప్రత్యేక ప్రణాళిక‌తో ముందుకు వెళ్తున్నామ‌ని అన్నారు. ఎకో, వాట‌ర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజంకు తెలంగాణ అనుకూలంగా ఉంద‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక బ‌డ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింద‌ని చెప్పారు. తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధికి.. కేంద్ర ప్రభుత్వ స‌హ‌కారం కూడా అవ‌స‌ర‌మ‌ని, నిధులు కేటాయించాల‌ని గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ను కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూత‌న ప‌ర్యాట‌క విధానం తీసుకొచ్చి.. తెలంగాణ‌ను దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. మంత్రి వెంట‌ తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ముఖ్యకార్యద‌ర్శి వాణి ప్రసాద్, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, తదిత‌రులు ఉన్నారు.

Advertisement

Next Story