రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

by GSrikanth |
రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటిషియన్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి లేవనెత్తిన రాయల తెలంగాణ అంశంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందని అన్నారు. సువర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. పాలకులను మార్చుకోండి.. సువర్ణాంధ్రగా మార్చుకోండి అని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు తనానికి కారణమైన పాలకులపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Next Story

Most Viewed