కేటీఆర్ బర్త్ డే వేళ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

by Javid Pasha |   ( Updated:2023-07-25 12:30:04.0  )
కేటీఆర్ బర్త్ డే వేళ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు 47వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా కేటీఆర్ బర్త్ డే వేళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు.

అలాగే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆరోగ్య తెలంగాణ సాధనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

Advertisement

Next Story