బండి సంజయ్ మాయ మాటలు చెప్పే ఓ డ్రామా ఆర్టిస్ట్: మంత్రి గంగుల ఫైర్

by Satheesh |   ( Updated:2023-11-20 07:43:48.0  )
బండి సంజయ్ మాయ మాటలు చెప్పే ఓ డ్రామా ఆర్టిస్ట్: మంత్రి గంగుల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి గంగులపై బండి తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు తాజాగా మంత్రి గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గంగుల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెప్పి నటించే డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.

కరీంనగర్ ఎంపీగా నాలుగున్నరేళ్లు ఏం చేశాడో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతోన్న బండి సంజయ్‌ను గ్రామాల్లో మహిళలు నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ హై కమాండ్ ఎంపీగా టికెట్ ఇవ్వమని చెప్తే.. ఎమ్మెల్యేగా పోటీకి వస్తుండని సెటైర్ వేశారు. నాలుగున్నర ఏళ్లుగా అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఎన్నికలకు వస్తున్నాడని.. బండి సంజయ్ ఓటుకు రూ.20 వేలు, సెల్ ఫోన్లు ఇస్తే తీసుకుని.. కారు గుర్తుకు ఓటు వేయండి మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. గంగుల, బండి మాటల యుద్ధంతో కరీంనగర్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి.

Advertisement

Next Story