KTRకు మైండ్ బ్లాక్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-25 06:11:11.0  )
KTRకు మైండ్ బ్లాక్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. సిరిసిల్లలో ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేటీఆర్‌కు మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఆయనవి విధ్వంస రాజకీయాలన్నారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారన్నారు. మీ అహంకారమే మీ ఓటమికి కారణమన్నారు. తొమ్మిదేళ్ల పాటు తెలంగాణలో గడీల పాలన కొనసాగిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సర్పంచుల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది ఎవరని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాలో కేటీఆర్ పనిచేయాలన్నారు.

Read More: సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story