- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు నుంచి ఉపశమనం అందించేలా...రేపటి నుండి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమవారం నుంచి ఆరు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవొచ్చని తెలిపింది. కాగా, శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Next Story