- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్ చిరంజీవి కీలక మేసేజ్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఓటర్లకు మెగాస్టార్ చిరంజీవి కీలక మేసేజ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటును యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్టేట్, సెంట్రల్‌లో సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. కాగా, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా, చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ జూబ్లీక్లబ్‌లో చిరంజీవి దంపతులు ఓటు వేశారు. అనంతరం మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ పై కామెంట్స్ చేశారు. ఇక, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేశారు.