- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ మీటింగ్ సమయంలో హైదరాబాద్‌లో ముగ్గురు సీఎంల భేటీ!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. 8వ సారి జరిగుతున్న కౌన్సిల్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 'వికాసిత్ భారత్ @2047', టీమ్ ఇండియా పాత్రపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎంఎస్ఎంఈఎస్ లు, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, మహిళా సాధికారత, ఆరోగ్యం-పోషణ, నైపుణ్య అభివృద్ధి, ఏరియా డెవలప్‌మెంట్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గతి శక్తి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రధాని మోడీ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.
నీతి ఆయోగ్ భేటీ సమయంలో హైదరాబాద్ లో ముగ్గురు సీఎంల భేటీ!
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్ లు దూరంగా ఉన్నారు. అయితే నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే హైదరాబాద్ లో ముగ్గురు సీఎంలు సమావేశం కావడం ఆసక్తిగా మారింది. ఇవాళ కేసీఆర్ తో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు భేటీ కాబోతున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, అధికారాల వ్యవహారంపై కేంద్రం ఆర్డినెన్స్ విషయంలో మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ కేసీఆర్ సమావేశం అవుతున్నారు. వీరి చర్చలు కేవలం ఆర్డినెన్స్ విషయంలో మద్దతు వరకే పరిమితం అవుతాయా లేక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఫ్రంట్ అంశంపై కూడా చర్చలు ఉంటాయా అనేది ఉత్కంఠగా మారింది.
Read more:
KCR: ఉత్తర తెలంగాణ నేతలకు గులాబీ బాస్ వార్నింగ్!
Focus: ఆ జిల్లాకు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పర్యటన