- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు.. మీనాక్షి నటరాజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)లో అంతర్గత రాజకీయాలు లేవని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి రాజకీయ నేతల వరకు ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. దేశంలో ఎక్కడైనా.. ఏ పార్టీలోనైనా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సర్వసాధారణమని కామెంట్ చేశారు. కానీ, పార్టీ పరంగా అందని నేతల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలకు సముచిత స్థానం ఉంటుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో తన శక్తి మేర కష్టపడి పని చేస్తానని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తనపై పెట్టిన బాధ్యతలను సమర్ధవంతగా నెరవేరుస్తూనే వారి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్తానని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు.
కాగా, ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ (Kachiguda Railway Station)కు చేరుకున్న ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్ (Harkara Venugopal), ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.