- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యే అని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు ఇదే వెల్లడించారని సీపీ పేర్కొన్నారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో సీపీ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. మెడికో ప్రీతి సూసైడ్‌కు ఆమె సీనియర్ సైఫ్‌యే ప్రధాన కారణమని సీపీ స్పష్టం చేశారు.
అతడి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్‌ను వారం, పదిరోజుల్లో దాఖలు చేస్తామని చెప్పారు. అయితే, ప్రీతి కుంటుంబ సభ్యులు మెదటి నుండి తమ కూతురిది హత్యే అని ఆరోపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ప్రీతిది ఆత్మహత్యే అని సీపీ తేల్చేశారు. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రీతి సీనియర్ సైఫ్ ఇటీవల బెయిల్‌పై జైలు నుండి బయటికొచ్చిన విషయం తెలిసిందే.