పార్టీ టికెట్​ ఇవ్వకపోతే రెబల్​గా పోటీలో ఉంటా : Gottumukkala Venkateswar Rao

by Sumithra |   ( Updated:2023-08-20 16:16:47.0  )
పార్టీ టికెట్​ ఇవ్వకపోతే రెబల్​గా పోటీలో ఉంటా : Gottumukkala Venkateswar Rao
X

దిశ, కూకట్​పల్లి : బీఆర్​ఎస్ పార్టీ టికెట్​ ఇవ్వక పోతే రెబల్​ అభ్యర్థిగా పోటీలో ఉంటానని కూకట్​పల్లి బీఆర్​ఎస్​ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర్​ రావు అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గానికి చెందిన యువతతో ఆదివారం వైష్ణవి గ్రాండ్​ హోటల్​లో నిర్వహించిన యూత్​ ఇంటరాక్షన్​ విత్​ జీవీఆర్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల వెంకటేశ్వర్​ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలకంగా పనిచేస్తూ వచ్చానని, నియోజకవర్గంలో బీఆర్ఎస్​ పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. 2018 ఎన్నికలలో పార్టీ టికెట్​ ఆశించి పాదయాత్ర ప్రారంభించగా మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సి నవీన్​ కుమార్​లు బుజ్జగించి సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే టికెట్​ ఇస్తున్నాము, పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి నామినేటెడ్​ పదవి ఇస్తామని చెప్పి పోటీ నుంచి తప్పించారని అన్నారు.

రానున్న ఎన్నికలలో బీఆర్​ఎస్​ పార్టీ తనకు అవకాశం కల్పించాలని, బీఆర్​ఎస్​ పార్టీకి తానే ఎప్పటికి వ్యతిరేకం కాదని, పార్టీకి, పార్టీ అధిష్టానానికి విధేయుడిగానే ఉంటానని అన్నారు. పార్టీ టికెట్​ ఇవ్వకుండా తానే బీఆర్​ఎస్​ రెబల్​ అభ్యర్థిగా పోటీలో ఉంటానని అన్నారు. తన వెంట యువత, మహిళలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ప్రజా బలం నిరూపించుకోమని పార్టీ అధిష్టానం చెబితే తన సత్తా చూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో కబ్జాలు, అక్రమాలను అరికట్టి, ప్రజలకు మంచి పాలనను అందిస్తానని చెప్పారు. రాజకీయాలలో యువత ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వారి సలహాలు సూచనలు సైతం తీసుకుంటున్నట్టు తెలిపారు. పార్టీ నిర్ణయం బట్టి రానున్న ఎన్నికలలో తన కార్యచరణ ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story