మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

by S Gopi |
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
X

దిశ, కాప్రా: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కాప్రా మున్సిపల్ కార్యాలయ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మేల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మహిళా కార్పొరేటర్లను, మహిళలను శాలువాలతో సత్కరించి ఉమేన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుండాలని, ప్రభుత్వం మహిళల రక్షణకు షీ టీంలు ఏర్పాటు చేసి మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. త్వరలోనే మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ఆరోగ్యం -మహిళ అనే కార్యక్రమాన్ని తీసుకురానుందన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమనీ, మహిళలు పురుషులతో సమాన అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు అపూర్వ విజయాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుండి జననం, ఆరోగ్యం, విద్య, వివాహంతోపాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలాగా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో కాప్రా డీసీ శంకర్, కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, జేరిపోతుల ప్రభుదాస్, పన్నల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, మాజీ కార్పరేటర్లు కొత్త రామారావు, సబ్ ఇన్స్పెక్టర్ షఫీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, పట్టణ సమైక్య అధ్యక్షురాలు ఊర్మిళ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్స్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, సాయి జన శేఖర్, బేతాళ బాలరాజు, కుమార స్వామి, ఏనుగు సీతారాం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లేష్, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story