యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన..

by Aamani |
యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన..
X

దిశ,జవహర్ నగర్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నేతలు, ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పినా...ఇక్కడి అధికార పార్టీ నేతలు మాత్రం ఎన్నికల కోడ్ అమలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. కోడ్ అమలులో ఉన్నా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలు జరగడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేషన్ లో ఎన్నికల కోడ్ ఉన్నట్లా లేనట్లా...?

కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చూసినా రాజకీయ పార్టీల రహస్య గ్రూపులు, రాత్రుల్లో ఇళ్ళల్లో, పగలు ప్రభుత్వ భవనాలల్లో గుంపులు గుంపులుగా దర్శనమిస్తూ ఎన్నికల నిబంధనల లోపాలను ఎత్తి చూపుతున్నాయి. డ్వాక్రా మహిళలలను ప్రలోభాలకు గురి చేస్తూ ఏకంగా డ్వాక్రా భవనంలోకి వెళ్లి అక్కడ సమావేశంలో ఉన్న మహిళలకు దండం పెడుతూ ఓ నాయకుడు, ఓ మహిళా కో ఆప్షన్ మెంబర్ దర్శనం ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో సదరు నేతలు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు డబ్బులు,మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని, ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే ముందు ముందు ఇంకేం కట్టడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఎన్నికల అధికారి స్పందించి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు జరుగుతున్న ఎన్నికల నిబంధనలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, ఎన్నికల కోడ్ ను సంపూర్ణంగా అమలు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.



Next Story