భారీ బందోబస్తు మధ్య కూల్చివేత.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గుర్రం విజయ లక్ష్మి

by Prasanna |
భారీ బందోబస్తు మధ్య కూల్చివేత.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గుర్రం విజయ లక్ష్మి
X

దిశ, దుండిగల్: అక్రమనిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా దూకుడు పెంచింది,ఆదివారం, సెలవులు అన్న తేడాలేకుండా అక్రమార్కుల భరతం పెట్టేందుకు శ్రీకారం చుట్టింది,అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ (గుర్రం విజయలక్ష్మి) మల్లంపేట కత్వా చెరువు ఎఫ్ టి ఎల్ ను ఆక్రమంచి నిర్మించిన 21 విల్లాలను ఆదివారం ఉదయం తొలగించేందుకు ప్రయత్నించగా గుర్రం విజయలక్ష్మి అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం,హైడ్రా అధికారులు పోలీస్ ల భారీ బందోబస్తునడుమ అక్రమనిర్మాణాలను తొలగిస్తున్నారు

దుండిగల్ మున్సిపాలిటీ,మల్లంపేట లో గుర్రం విజయలక్ష్మి విహాన హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద తప్పుడు అనుమతులు పొందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ సుమారు 352 విల్లాలను నిర్మించిగా ఫిర్యాదుల ఆధారంగా గత రెండు మాసాల నుండి దిశ దినపత్రికలో పతాక శీర్షికలో వివిధ కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే,వార్తకథనాలు,ఫిర్యాదుల ఆధారంగా గత వసరం లో హైడ్రా కమీసనర్ ఏ.వి రంగనాధ్ స్వయంగా పరాశీలించారు,అక్రమనిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు ఆదివారం జెసిబితో అక్రమనిర్మాణాలను తొలగొస్తున్నారు.తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్, దుండిగల్ సిఐ పి సతీసి, దుండిగల్ డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ సతీష్,మున్సిపల్ కమీసనర్ సత్యనారాయణ ఆయా శాఖ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed