- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యర్థాల శుద్ధీకరణపై వాలంటీర్లకు, కార్మికులకు శిక్షణ..
దిశ, మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమీకృత వ్యర్థాల శుద్ధీకరణ పార్క్ లో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ డా. పి రామకృష్ణ రావు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ వాలంటీర్లకు, స్వచ్ఛ కార్మికులకు శిక్షణ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత వ్యర్థాల శుద్దీకరణ పార్క్ (డంపింగ్ యార్డ్) నందు రూ.54 లక్షల వ్యయంతో నూతంగా ఏర్పాటు చేసిన ట్రెడెడ్ అండ్ బ్రిక్కెడ్ మిషన్ పనితీరును కార్పొరేటర్లు, అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ కార్మికులు, వాలంటీర్ల పనితీరును ప్రశంసించారు. మీ అందరి సహకారంతో నగరంలో తడి, పొడి చెత్తను100 శాతం వేర్వేరుగా సేకరించడంతో పాటు సేకరించిన తడి, పొడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువును తయారు చేస్తున్నామన్నారు. అందువల్ల రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సైతం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అందుకుందని గుర్తుచేశారు.
కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా వారికి వైద్య పరీక్షల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడంతో పాటు అవసరమైతే మరిన్ని ఆటోలు కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్, సుభాష్ నాయక్, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, బచ్చ రాజు, అమర్ సింగ్, నవీన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, నాయకులు ఈశ్వర్ రెడ్డి, చెరుకు పెంటయ్య గౌడ్, జావీద్ ఖాన్, డీఈఈ శ్రీనివాస్, ఏఈ బిక్షపతి, సానిటరీ ఇన్ స్పెక్టర్ జానకి, క్లస్టర్ మేనేజర్ రఘువీర్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.