- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో ఇద్ధరే త్యాగమూర్తులు
దిశ, మల్కాజిగిరి : దేశంలో ఇద్ధరే త్యాగమూర్తులని వారు రైతులు, సైనికులని ఏంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వాయుపురిలో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశానికి ఇద్దరే త్యాగమూర్తులని, ఒకరు తుపాకీ పట్టి ప్రతిక్షణం భారతమాతను కాపాడే సైనికులు కాగా, మరొకరు రక్తాన్ని చమటగా మార్చి దేశ ప్రజలకు అన్నం పెట్టే కిసాన్ అన్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వత మోడీ సైన్యానికి అనేక రకాల సౌకర్యాలు కల్పించారన్నారు. రాష్ట్ర కన్వీనర్ గోపు రమణారెడ్డి, ఆల్ ఇండియా ఎన్ ఎక్స్ సీసీ చైర్మన్ లింగాల జగన్ రెడ్డి మాట్లాడుతూ సైన్యంలో ఉన్నప్పుడు ఏళ్ల తరబడి భార్య పిల్లలకు దూరంగా ఉండి రిటైర్మెంట్ అయిన తరువాత బ్యాంకు ఉద్యోగంలో చేరగా ఇంటికి చాలా కిలోమీటర్ల దూరంలో డూటీ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.