- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టణ ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ : మంత్రి మల్లారెడ్డి
దిశ, మేడ్చల్ టౌన్ : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రగతి సాధిస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో మూడు కార్పొరేషన్ 7 మున్సిపల్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వసతులు కల్పించామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణలో మేడ్చల్ మున్సిపల్ అవార్డు సైతం పొందారని మంత్రి గుర్తు చేశారు.
అనంతరం మేడ్చల్ మున్సిపల్ కార్మికులను మంత్రి మల్లారెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కౌన్సిలర్ లు గణేష్, స్వామి, బత్తుల శివ కుమార్ యాదవ్, జంగయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఉమానాగరాజు, మాధవి నరేందర్ వంజరి, కౌడే మహేష్, నాయకులు నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, విష్ణు చారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.