వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |   ( Updated:2023-04-29 12:05:09.0  )
వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, దమ్మాయిగూడ: వైద్య రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, ప్రతి పల్లెకు, పట్టణానికి వైద్యాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు ఓల్డ్ విలేజ్ బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి మల్లారెడ్డి చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణ రాష్టం దేశానికే ఆదర్శం గా నిలుస్తుందని, తెలంగాణ లోని పథకాలు ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని తెలిపారు.

బీఆర్ఎస్ ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. బస్తీ దవాఖానా దమ్మాయిగూడ మున్సిపల్ ప్రజలకు అత్యవసర సేవలు, అన్ని రకాల వైద్య సేవలకు నిలయంగా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, డీఈఈ సుమతి , కౌన్సిలర్లు నాను నాయక్, నాగయపల్లి సుజాత, కొత్త హేమలత, మంగళపూరి వెంకటేష్, కొత్త సురేఖ, మాదిరెడ్డి పావనిరెడ్డి, సంపంన్ బోల్ స్వప్న, గురువెల్లి వెంకటరమణ, పాండాల అనురాధ, వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహారెడ్డి, డాక్టర్ సరిత, డాక్టర్ కృతిక, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed