సిరందాస్ సేవలు స్ఫూర్తిదాయకం

by Sridhar Babu |
సిరందాస్ సేవలు స్ఫూర్తిదాయకం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రతి ఉద్యోగి పదవీ విరమణ తర్వాత తన వంతుగా సామాజిక సేవలలో పాల్గొనాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సిరందాస్ కృష్ణయ్య పదవీ విరమణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేటీసీ మాట్లాడుతూ తన సర్వీసులో ఎక్కువ కాలం కృష్ణయ్య తనతో కలిసి పని చేశారని, ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించే నైపుణ్యం ఆయన సొంతమని తెలిపారు.

విధి నిర్వహణలో ఉద్యోగులతోనే కాకుండా వివిధ సేవలకు వచ్చిన పౌరులతో కూడా మమేకమై సేవలందించిన ఆయన సౌమ్యుడిగా అందరికీ సుపరిచితుడని గుర్తు చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణతో బాధ్యత తీరిపోదని, తదానంతరం ప్రజాసేవ కార్యక్రమాలలో పాల్గొని తన వంతుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు సూచించారు. పదవీ విరమణ కార్యక్రమంలో భాగంగా సిరందాస్ కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. ఇంచార్జ్ ఆర్టీవో ఏరి స్వామి, ఇన్స్పెక్టర్ లు జై.చందర్, నరసింహస్వామి, అవినాష్, నేహ, లావణ్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు వాణి, యాదమ్మ, టీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు కిరణ్, ఉదయ్ రాజ్, పవన్ తోటి ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story