ప్రజల సమస్యలను పరిష్కరించాలి

by Sridhar Babu |
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, కూకట్​పల్లి : ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్​బీ కాలనీ డివిజన్​ పరిధిలోని శ్రీలా అపార్ట్​మెంట్​ రోడ్డు, మలేషియన్​ టౌన్షిప్​ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ రావు, అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కాలనీలో రోడ్డు, డ్రైనేజీకి సంబంధించిన సమస్యలున్నాయని, అదే విధంగా భారీ వర్షాలకు మలేషియన్​ టౌన్షిప్​ నుంచి వరద నీరు రోడ్డు పైకి వచ్చి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మలేషియన్​ టౌన్షిప్​ వద్ద వరద నీటి కాలువను నిర్మించి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మందలపు సాయిబాబా చౌదరి, మలేషియన్ టౌన్షిప్ అధ్యక్షుడు సాయి చౌదరి, కాకర్ల సురేష్, ఆదినారాయణ, రాజేష్ పాల్గొన్నారు

కార్యకర్తలతో సమావేశం

పార్టీ కోసం కష్టపడేవారికి బీఆర్​ఎస్​ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే తన కార్యాలయంలో శనివారం బేగంపేట్​ డివిజన్​ కార్పొరేటర్​ మహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బేగంపేట్​ డివిజన్​ ప్రజలకు ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యలను బీఆర్​ఎస్​ హయాంలో పరిష్కరించడం జరిగిందని అన్నారు.

అదే విధంగా నాలా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, డివిజన్​ పరిధిలో ప్రజలకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా వెన్నంటి ఉంటానని, ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సురేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేష్, రాజయ్య, రఘు నాథ్, ప్రవీణ్, మాణిక్యం, సునీత, సాయి, శ్రీను, బాలరాజు, జహంగీర్, జావీద్, లక్ష్మి బాయి తదితర పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కు అందజేత

ఫతేనగర్​ డివిజన్​కు చెందిన ఎస్​. సాయి తేజకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చర్యలు తీసుకున్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో సాయితేజ కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed