- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'ఉద్యమకారుల వెన్నంటే ఉన్న మైనంపల్లి'
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : ఇతర పార్టీలలో ఉన్నప్పటికీ తాను ఉద్యమకారులతోనే వెన్నంటి ఉన్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అందె శ్రీనివాస్ ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా, గురువారం ఆయన దశదిన కర్మను బొల్లారంలోని తన నివాసం వద్ద నిర్వహించారు. మల్కాజిగిరి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, జి.సాయన్న, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్, క్రిశాంక్, మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పీడమర్తి రవి తదితర ప్రముఖలు అందె శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అందె శ్రీనివాస్ పోరాట పటిమ స్పూర్తి దాయకమన్నారు. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్,గజ్జెల నగేశ్, పీడమర్తి రవిలు మాట్లాడుతూ.. మళిదశ తెలంగాణ ఉద్యమంలో అందె శ్రీను కీలక భూమిక పోశించారని గుర్తు చేశారు. అందె శ్రీను మన నుంచి దూరమైన ఆయన అశయాలను ముందుకు తీసుకువెళ్తామని, ఆయన కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్, మాజీ బోర్డు సభ్యుడు లోక్ నాథం, బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ టీ.ఎన్.శ్రీనివాస్, నాయకులు మహిళ నేతలు నివేధిత తెలంగాణ జేసీఏ నాయకులు సురేందర్, తెలంగాణ ఉద్యమకారులు ప్రభుకుమార్ గుప్తా, శేర్విన్ కుమార్, పెంట శ్రీహరి, కుమార్,పరమేశ్,జంగాల మురళీయాదవ్, సతీష్,సాయి,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.