- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జన్మ ధన్యమైంది: మర్రి రాజశేఖర్ రెడ్డి
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ముందస్తు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రతినిధుల సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఇంత పెద్ద ఎత్తున తరలిరావడం చూస్తుంటే నా జన్మ ధన్యమైందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు మాజీ సభ్యులుజక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ ల పర్యవేక్షణలో మంగళవారం బోయిన్ పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ లో ముందస్తు పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో హైద్రాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి దాసోజు శ్రావణ్, తెలంగాణ బేవరేజెస్ చైర్మన్ గజ్జెల నాగేష్, తెలంగాణ మినరల్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రిశాంక్, శ్రీగణేష్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ శ్రీ గణేష్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురులు లాస్య నందిత, నివేదితలు ముఖ్య ఆతిధులుగా పాల్గొని మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ కి చెందిన పలువురు నాయకులు పార్టీ తీర్మానాలను చదువుగా వాటిని అందరూ కలిసి ఆమోదం తెలియజేశారు. అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరుగని విధంగా ఈ కార్యక్రమం జరిగిందని,ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు మర్రి రాజశేఖరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఇదే స్ఫూర్తి, ఇదే ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, పార్టీ సూచించిన అభ్యర్ధి గెలుపునకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎప్పుడు, ఎలాంటి సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకు వస్తే సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సాయన్న లేని లోటు తీర్చలేనిది అని ఆయన కూతుళ్లు కూడ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారని, వారిని పార్టీ కార్యకలాపాలలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యులు ప్రభాకర్, నళిని కిరణ్, భాగ్యశ్రీ, లోక్ నాథం, కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన వివిధ ఆలయాల, మార్కెట్ యార్డుల చైర్మన్ లు, మాజీ చైర్మన్ లు, హారిక ఆనంద్ బాబు, టీఎన్ శ్రీనివాస్, సంతోష్ , సుశాంత్, ఉద్యమ కారులు బాబు, ప్రభుగుప్త, నర్సింహాయాదవ్, నర్సింహా ముదిరాజ్, పెంట శ్రీహరి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, రాజు సింగ్ తదితరులు పాల్గొన్నారు.