- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరుణామూర్తి... ఏసుక్రీస్తు
దిశ, తిరుమలగిరి : ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయుడు ఏసుక్రీస్తు అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం రసూల్ పురా 2వ వార్డులో శుక్రవారం స్కోత్ గ్యాస్పెల్ చర్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం సేవ, కరుణ, త్యాగానికి ప్రతీక అన్నారు. మనుషులందరూ ఆయన మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. అదే విధంగా క్రిస్టియన్ సోదరులకు ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే విధంగా క్రిస్మస్ వేడుకల సందర్భంగా నియోజకవర్గంలోని క్రిస్టియన్స్ సోదరులకు చర్చిల ద్వారా ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు బహుమతిగా అందిస్తుందని అన్నారు. ఈ అంశానికి సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివిధ చర్చిలలోని పలువురు పాస్టర్లతో ఎమ్మెల్యే శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు చర్చిలలోని పరిస్థితులు, వారికి ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే పాస్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చర్చి పాస్టర్ లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.