- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు: డీసీపీ గజానంద్
దిశ , మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని టౌన్ ప్లానింగ్ డీసీపీ గజానంద్, సెక్షన్ ఆఫీసర్ తుల్జా సింగ్ హెచ్చరించారు. గురువారం మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు పలు పిర్యాదులు వచ్చాయన్నారు.
కాలనీవాసుల ఫిర్యాదు మేరకు సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేసి నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలు కూల్చి వేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మాణదారులు జీహెచ్ఎంసీ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.