- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ లక్ష రూపాయలే ఇస్తున్నాం.. తులం బంగారం ఎక్కడ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోథ్, సోనాల మండలాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రారంభించిన లక్ష రూపాయలే ఇస్తున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం జాడే లేదని అన్నారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి హామీ ఇచ్చిన తులం బంగారం త్వరగా అందజేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 130 మంది లబ్ధిదారులకు దాదాపు 30 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బోథ్ తహశీల్దార్ సుభాష్ చంద్ర, సోనాల తహశీల్దార్ మల్లేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సంధ్యారాణి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.