ప్రతిపక్షాలకు దిమాక్​ పనిచేస్తుందా ?

by Disha Web Desk 15 |
ప్రతిపక్షాలకు దిమాక్​ పనిచేస్తుందా ?
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రతిపక్షాలకు దిమాక్​ పనిచేస్తుందా ? అని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తాము జై శ్రీరాం అని మాత్రమే బీజేపీ ఓట్లు అడగటం లేదని, 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓట్లు అడుగుతున్నామని రాజేందర్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్ తో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల దిమాక్ పని చేస్తలేదని, అందుకే వారు ఏదో ఒక నెపంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి గత పది సంవత్సరాల కాలంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమాత్రం పోల్చుకోలేవని తెలిపారు. అభివృద్ధితో పాటుగా భారతీయుల విశ్వాసాలు

కాపాడే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. త్రిపుల్ తలాక్​ తొలగించి ముస్లిం మహిళల విశ్వాసం పొందిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రపంచం అంటే అమెరికా మాత్రమే ముందు వరుసలో నిలిచిందని, దాని సరసన ఇప్పుడు భారత్ చేరిందని అన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపడానికి భారత సహకారం కావాలని రష్యా ఉత్తరం రాసిన విషయాన్ని గమనిస్తే భారత్ ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండేదని, ప్రస్తుతం ఆ స్థానం ఐదుకు చేరిందని మరొకసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానానికి తీసుకువెళ్లి నిలుపుతారని అన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్ కే దక్కిందని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థిగా తనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశ తిలక్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.



Next Story

Most Viewed