బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం : Marri Rajasekhar Reddy

by Aamani |   ( Updated:2023-10-03 15:25:12.0  )
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం :  Marri Rajasekhar Reddy
X

దిశ, మల్కాజిగిరి : బీఆర్ఎస్ తోనే మల్కాజిగిరి అభివృద్ధి సాధిస్తుందని మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్ వినాయక్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తిరిగి బీఆర్ ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమపథకాలను అందిస్తుందన్నారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ, మల్కాజిగిరిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మురుగేష్, మారయ్య, జేఏసీ వెంకన్న, కృష్ణమూర్తి, డివిజన్ ప్రెసిడెంట్ సురేశ్, బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed