- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దరఖాస్తుదారులతో మర్యాదగా మెలగండి
దిశ, మేడ్చల్ బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులతో సౌమ్యంగా మాట్లాడుతూ.. అవసమైన డాక్యుమెంట్లు, వివరాలను సేకరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. మంగళవారం మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తండాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మోబైల్ యాప్ ద్వారా నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహిస్తున్న అధికారులు దరఖాస్తుదారులతో మార్యద పూర్వకంగా మాట్లాడుతూ వారి వివరాలను సేకరించాలని, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు పూర్తయ్యాయని, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మోబైల్ యాప్ ద్వారా ఏ విధంగా వివరాలు నమోదు చేస్తున్నారని ఎంపీడీఓ ను అడిగి తెలుసుకున్నారు. తొందరపాటుగా కాకుండా జాగ్రత్తగా తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలున్నాయా అని కలెక్టర్ ప్రశ్నించగా యాప్ చాలా స్లోగా ఉందని, ఫొటోలు సేవ్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. యాప్ లో సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, తహసీల్దార్ నర్సింహారెడ్డి, ఎంపీడీఓ వత్సలా దేవి పాల్గొన్నారు.